![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది రతికా రోజ్. ఈమె సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యింది. రతికా రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది. "ఫేవరేట్ ఫుడ్ ఏమిటి" "వైట్ రైస్ తో మటన్ కర్రీ అలాగే సి ఫుడ్ కూడా" అంది " ప్రశాంత్ మీద లవ్ ప్రాంక్ చేయండి" "లవ్ ప్రాంక్ చేస్తే దాన్ని లైట్ తీసుకునేంత మెచ్యూర్డ్ పర్సన్ ఐతే పల్లవి ప్రశాంత్ కాదు. అతను చాలా సెన్సెటివ్, ఎమోషనల్ గా ఉంటాడు అంటే నేను లవ్ ప్రాంక్ చేయలేను" అని చెప్పింది.
"బిగ్ బాస్ లో ఎవరు ఇష్టం" " శివ అన్న" "మీకు బాయ్ ఫ్రెండ్" "సింగల్" అని చెప్పింది. "బ్లైండ్ గా ఎవరితో ఐనా డేట్ చేశారా" "లేదు..పెళ్లికి దారి తీసే రిలేషన్ షిప్ ని తప్ప ఎవరితోనూ డేట్ చేయను..నేను చాలా ఎమోషనల్" "మా కోసం ఒక పాట పాడొచ్చు కదా" " కొన్ని ఇంటరెస్టింగ్ థింగ్స్ త్వరలో జరగబోతున్నాయి...వెయిట్ చేయండి తెలుసుకోవడానికి" "శ్రీముఖి మీద మీ అభిప్రాయం" "తెలంగాణ రాములమ్మ" "పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరికి రమ్మని పిలవలేదా" "పిలవలేదు" అని చెప్పింది. "అమర్ దీప్ చౌదరి మీద మీ అభిప్రాయం" " రాజా ది గ్రేట్" "మీరేం చదువుకున్నారు మీ పుట్టిన రోజు ఎప్పుడు" "ఇంజనీరింగ్ చదువుకున్నా...మే 12 .. ఫిబ్రవరి 14 కి సింగల్ అండ్ సోలో అంతే ప్లాన్స్ ఏమీ లేవు" అని చెప్పింది రతికా రోజ్. రతికా రోజ్ నటిగా, మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2016లో తెలుగు కామెడీ షో ‘పటాస్’తో షో తో పరిచయమయ్యింది. ఇంతకు ఆ ఇంటరెస్టింగ్ విషయం ఏమిటి.. రీల్స్, లిప్ సింక్ వీడియోస్ తో ఆకట్టుకునే రతికా సింగరాగా మారబోతోందా...? అని అడుగుతున్నారు నెటిజన్స్..
![]() |
![]() |